పూర్వము దాదాపు గత 100 సం"రాల క్రితము గిరిజనులు వారి ఆరాధ్య దైవంగా అమ్మవారిని కొలిచేవారు, కాలక్రమంగా ప్రకృతి వైపరిత్యాల వల్ల అమ్మవారు భూగర్భంలో నిక్షిప్తమైపోయినది అయిననూ బాటసారులు అక్కడికి వచ్చి అమ్మవారిని తలచినంతనే వారి కష్టాలను కడతీర్చేది. తర్వాత లేతనగూడెం గ్రామం చుట్టూ నీరు చేరడంతో పునరవాసానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయితే అమ్మవారు పునః వైభవం పొందాలనే సంకలిపంచినట్టుగా ఆ గ్రామం ఇందిరానగర్ గ్రామంగా ఇక్కడ వెలిసింది.
అయితే బాలలు భగవంతుడు ఒక్కటే అన్నట్లుగా బాలుడైన మోర్లే వినోద్ శరీరంలో అమ్మవారు ఆవహించింది. ఆయన స్వప్నములో సాక్షాత్కరించింది. ఈ గ్రామ సమీపాన గల పుట్టలో (వాల్మీకంలో) నేను ఉన్నానని నాకు దేవాలయం నిర్మించి పూజించుము నేను నీ శరీరంలో కొలువుండి నీ ద్వారా భక్తుల ఆయురారోగ్యాలు కాపాడి శిశు, పశు, పాడిపంటలు రక్షించి దుష్టులను, దుష్టశక్తులను దునుమాడి సమీపంలో గల రహదారిల పై జరిగే ప్రమాదాలను నివారించి అపమృత్యు బాధలు లేకుండా కాపాడుతానని సెలవిచ్చింది. అప్పుడు వినోద్ గారు పుట్టలో కోటి సూర్యుల ప్రకాశంతో విరాజిల్లుతున్న స్వయంభు శ్రీ మహంకాళి అమ్మవారిని చైత్ర పౌర్ణమి 15 - 05-2014 రోజున బయటకు తీసి పూజలు ప్రారంభించారు.
అప్పటి నుండి దినదిన ప్రవర్థ మానమై అ ప్రాంతం శశ్యమాలంగా మారి పాడిపంటలు వర్ధిల్లాయి. రహదారి ప్రమాదాల సైతం ఆగిపోయాయి. చాందా (చంద్రపూర్) మహంకాళి మాత తర్వాత అంతటి మహిమాన్వితమైన అమ్మవారు వెలియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ధన్యుల మైనామని భావించారు. అప్పటినుండి దేవర వినోద్ గా ఆ బాలుడు ప్రసిద్ధిగాంచడంతో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
తేదీ: 02-05-2016 రోజున అమ్మవారి అజ్ఞానుసారం శ్రీ శ్రీ స్వయంభు మహంకాళి దేవితో పాటు శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి సింహ వాహనము శిలా విగ్రహం మంత్ర ప్రతిష్ట పురోహిత బ్రహ్మశ్రీ పూసాల మహేశ్వర శాస్త్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
తర్వాత తెలంగాణ ప్రాంతంలోనే ఎత్తైన 21 అడుగుల అమ్మవారి విగ్రహం మరియు అమ్మవారు వెలసిన పుట్టపై 5పంచ శిరస్సుల నాగదేవత విగ్రహం మరియు భూగర్భంలో (గుహలో) చాందా మహంకాళి శయన మండపం నిర్మించి తేదీ: 01- 05-2018న ఆవిష్కరించడం జరిగింది.
ఇట్టి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలంనకు కేవలం 3 కి. మీ దూరంలో ఇంద్రనగర్ గ్రామంగా ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున అమ్మవారి కళ్యాణం, మరుసటి రోజు జాతర, బోనాల సమర్పణ, పల్లకి సేవా నిర్వహించబడును.
బోనాల జాతర రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాన్, గోధుమపిండి దీపాలు, పూర్ణం బూరెలు, బెల్లం అన్నం మరియు మేకలు, కోళ్లు కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తమ తమ కోరికలు నెరవేరాలని అమ్మవారు వెలసిన పుట్ట వద్ద ముడుపులు కట్టుకుంటారు.
మళ్లీ వచ్చే ఏడాది వరకు అమ్మవారు వారి వారి కోరికలను నెరవేరుస్తుంది.
దుర్గాదేవి శరన్నావరాత్రి ఉత్సవాలు నిర్వహించబడును. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ దేవస్థానంలో అమ్మవారి ఆలయంతో పాటు అరుణాచల శివుని ఆలయం, శనీశ్వరుని ఆలయం మరియు కాలభైరవ స్వామి ఆలయలు కలవు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి కొలువుదీరినాడు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు అమ్మవారి హోమం మరియు కాలభైరవ స్వామి హోమం ఉంటుంది. ప్రతి ఆదివారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది మరియు మంగళవారం, గురువారాలలో పులిహోర పంపిణీ ఉంటుంది
అమావాస్య, పౌర్ణమి, ఆదివారం , నవరాత్రులలో మరియు చైత్ర పౌర్ణమి జాతర రోజుల్లో దేవస్థానంలో అమ్మవారు వెలసిన పుట్టవద్ద ఎటువంటి కోరిక అయిన కోరుకొని ముడుపు కడితే ఆ తల్లి నెరవేరుస్తుంది.
దేవస్థానంలో గర్భగుడి వెనక భాగంలో భూగర్భం గుహలో అమ్మవారు పడుకొని ఉంటుంది అతల్లిని చూస్తే రెండు కళ్ళు సరిపోవు..
ఈ అమ్మవారిని దర్శించిన భక్తులకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వంశాభివృద్ధి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. భూత, ప్రేత, దుష్టశక్తి భయ గ్రస్తులకు సకల భయాలు తొలుగుతాయి. పాడి పంట, విజయం, రాజ్యం, శాంతి, ఆరోగ్యం సిద్ధిస్తుంది.